తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రణీత ఫ్రీ వ్యాక్సినేషన్​ డ్రైవ్.. 'కల్యాణం' సాంగ్​తో సమంత - movie news

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో ప్రణీత ఫ్రీ వ్యాక్సినేషన్​ డ్రైవ్, 'పుష్పక విమానం' పాట, బెంగాలీ ప్రముఖ నటి మరణానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి.

PRANITHA VACCINATION, PUSHPAKA VIMANAM SONG UPDATES
మూవీ న్యూస్

By

Published : Jun 16, 2021, 4:59 PM IST

*బెంగాలీ ప్రముఖ నటి స్వాతిలేఖ సేన్​గుప్తా(71).. బుధవారం తుదిశ్వాస విడిచారు. థియేటర్ ఆర్టిస్ట్​గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. సత్యజిత్​ రే(satyajit ray) తీసిన 'ఘరే బరే'లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు.

స్వాతిలేఖ సేన్ గుప్తా

*హీరోయిన్ ప్రణీత.. తన ఫౌండేషన్​(Pranitafoundation) ద్వారా ఉచిత వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను బెంగళూరులో ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇటీవల ఆమె ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.

వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో ప్రణీత

*ఆనంద్ దేవరకొండ 'పుష్పక విమానం' సినిమాలో 'కల్యాణం' సాంగ్​ శుక్రవారం విడుదల కానుంది. దీనిని ముద్దుగుమ్మ సమంత(Samantha) లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దామోదర దర్శకత్వం వహించారు.

పుష్పక విమానం పోస్టర్

*బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana).. ప్రముఖ దర్శకనిర్మాత ఆనంద్​ ఎల్.రాయ్​తో(Aanand L Rai) మరోసారి కలిసి పనిచేయనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుపై స్పష్టత రానుంది.

.

ABOUT THE AUTHOR

...view details