యువ హీరో అఖిల్ నటించిన 'హలో' చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలో అరంగేట్రం చేసిన కథానాయిక కల్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్‌తో కలిసి 'హృదయం' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకి వినీత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. విశాఖ సుబ్రహ్మణ్యం, నోబెల్బాబు ఈ చిత్రానికి నిర్మాతలు. ఇందులో దర్శన రాజేంద్రన్, మాయానాది, విజయ్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమకథగా వస్తున్న ఈ చిత్రాన్ని 2020 ఓనమ్ పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ప్రణవ్ మోహన్‌లాల్ సరసన కల్యాణి - తెలుగు సినిమా తాజా వార్తలు
మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా తెరెక్కుతోన్న చిత్రం 'హృదయం'. ఇందులో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్ కథానాయిక. వినీత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఓనమ్ పండుగకు విడుదల చేయనుంది చిత్రబృందం.

ప్రణవ్ సరసన కల్యాణి ప్రియదర్శన్
మరోవైపు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'మరక్కర్: అరబికాడలింటే సింహామ్' చిత్రంలోనూ ప్రణవ్, కల్యాణి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. హలో సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగం సినిమాల్లోనూ నటించి మెప్పించింది కల్యాణి.
ఇవీ చూడండి.. వెండితెరపై శభాష్ 'మిథాలీ'... నటి ఎవరో తెలుసా..?