తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అటు హీరోగా.. ఇటు సహాయ దర్శకుడిగా - అసిస్టెంట్​ డైరక్టర్​గా ప్రకాశ్​రాజ్

'రంగమార్తాండ' సినిమాకు హీరోగానే కాకుండా సహాయ దర్శకుడిగానూ పనిచేస్తున్నాడు ప్రకాశ్​రాజ్​. అందుకు సంబంధించిన ఓ వీడియోను దర్శకుడు కృష్ణవంశీ ట్విట్టర్​లో పంచుకున్నాడు.

అటు హీరోగా.. ఇటు సహాయ దర్శకుడిగా
ప్రకాశ్​రాజ్

By

Published : Dec 15, 2019, 9:18 AM IST

విలక్షణమైన నటనకు చిరునామా ప్రకాశ్​రాజ్‌. హీరోగా మెప్పించాడు. విలన్​గా భయపెట్టాడు. సహాయ నటుడిగా మురిపించాడు. ఇతడిలో నటుడే కాకుండా ఓ దర్శకుడు దాగి ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్​రాజ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ 'రంగమార్తాండ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం కోసం ప్రకాశ్​రాజ్‌ సహాయ దర్శకుడిగానూ మారారట. ఈ విషయాన్ని కృష్ణవంశీ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

"నా బృందంలో కొత్త సహాయ దర్శకుడు. ఆశీర్వదించండి" అంటూ ప్రకాశ్​రాజ్​కు సంబంధించిన వీడియోను షేర్‌ చేశాడు. ఈ వీడియోలో మిగతా అసిస్టెంట్‌ డైరక్టర్లతో కలిసి ఫొటో ఫ్రేమ్‌లు గోడకు అతికించడంలో సహాయం చేస్తూ కనిపించాడు ప్రకాశ్​రాజ్. ప్రతిరోజూ సెట్స్‌లో తన పాత్ర చిత్రీకరణ ముగిసిన వెంటనే ఇలా తోటి సాంకేతిక బృందానికి ఇలాగే పనిలో సహాయం చేస్తున్నారని చిత్రబృందం తెలిపింది.

రంగస్థల కళాకారుల తెర వెనుక జీవితాల కథతో ఈ చిత్రం తీస్తున్నారు. మరాఠీలో విజయవంతమైన 'నట సామ్రాట్‌' చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

'రంగమార్తాండ' సినిమా
'రంగమార్తాండ' సినిమా షూటింగ్​లో రమ్యకృష్ణ

ఇది చదవండి: ప్రకాశ్‌రాజ్‌ కుమార్తెగా 'దొరసాని'..?

ABOUT THE AUTHOR

...view details