తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జై భీమ్'లో చెంపదెబ్బ సీన్​పై స్పందించిన ప్రకాశ్​రాజ్

'జై భీమ్' సినిమాలో చెంపదెబ్బ సన్నివేశం వివాదస్పదమైంది. ఈ విషయమై ఆ సీన్​లో నటించిన ప్రకాశ్​రాజ్ స్పందించారు. మిగతా అంతా సినిమాలో దానిని మాత్రమే చూడటమేంటని అన్నారు.

Prakash Raj Jai Bhim movie
ప్రకాశ్​రాజ్

By

Published : Nov 7, 2021, 8:55 PM IST

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'జై భీమ్‌'. ఇటీవల నేరుగా ఓటీటీ (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)లో విడుదలైన ఈ చిత్రంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్‌, టాలీవుడ్‌ నటీనటులు సూర్య, లిజోమోల్‌ నటనను, సినిమాను ప్రశంసిస్తున్నారు.

మరోవైపు, సోషల్‌ మీడియా వేదికగా పలువురు ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ నటించిన ఓ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఈ చిత్రంలో విచారణాధికారి పెరుమాళ్ల స్వామి పాత్ర పోషించారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తిని విచారిస్తారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి హిందీలో మాట్లాడతాడు. అది నచ్చని ప్రకాశ్‌రాజ్‌ అతని చెంపపై కొట్టి తమిళంలో మాట్లాడమంటాడు. ప్రకాశ్‌రాజ్‌ అలా చేయడమే వివాదాస్పదమైంది.

జై భీమ్​ సినిమాలోని సన్నివేశం

హిందీ మాట్లాడేవారంతా ఆ సీన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమను అపహాస్యం చేయడమేనని సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగిస్తున్నారు. ఈ విషయంపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు.

'ఇందులో చూపించిన గిరిజనుల బాధలు, న్యాయం కోసం వారు చేసిన పోరాటాన్ని పక్కనపెట్టి కొందరు చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టిపెట్టారు. వారు ఈ సినిమాలో దాన్ని మాత్రమే చూశారు. వారి ఎజెండా ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. తప్పించుకునే మార్గం కోసం స్థానిక భాష తెలిసినా హిందీలో మాట్లాడుతుంటే ఏ పోలీసు అధికారి అయినా ఎలా స్పందిస్తారు? నా పాత్ర అలానే స్పందించింది' అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details