మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో(maa elections 2021) ఓటమి పాలైన ప్రకాశ్‌రాజ్(prakash raj panel).. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. పోలింగ్ రోజు మోహన్‌బాబు(mohan babu movies) దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఆయన విచక్షణరహితంగా వ్యవహరించారని లేఖలో రాసుకొచ్చారు.
మోహన్‌బాబు, నరేశ్ తీరు సీసీ కెమెరాల్లో రికార్డయిందని, సీసీ దృశ్యాలు చూస్తే అసలు విషయాలు తెలుస్తాయని ప్రకాశ్‌రాజ్ లేఖలో పేర్కొన్నారు. ఆ వీడియోలను మోహన్‌బాబు(mohan babu age) తొలగించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. సీనీ టీవీ వీడియోలు ఇవ్వాలని ప్రకాశ్‌రాజ్(prakash raj panel), ఎన్నికల అధికారిని కోరారు.