తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రకాశ్​రాజ్​ ఓటమి.. ముందే అర్ధమైంది..! - బెంగళూరు సెంట్రల్ స్వతంత్య్ర అభ్యర్థి

బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసిన ప్రకాశ్​రాజ్​.. ఎన్నికల్లో గెలుస్తానా, ఓడుతానా అనే విషయం కౌంటింగ్ మధ్యలోనే అర్ధం చేసుకున్నాడు. అందుకే లెక్కింపు కేంద్రం నుంచి మధ్యలోనే వెళ్లిపోయాడు. లౌకిక భారతదేశం కోసం ఎప్పటికీ కృషి చేస్తానంటూ ట్వీట్ చేశాడు. ఓటమి ఖరారైంది.

ప్రకాశ్​రాజ్​కు ఆ విషయం అర్ధమైంది..!

By

Published : May 23, 2019, 2:50 PM IST

Updated : May 23, 2019, 3:16 PM IST

తొలిసారిగా లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచిన నటుడు ప్రకాశ్​ రాజ్​ ఓటమిపాలయ్యారు. ఈ విషయం అతడికి మధ్యలోనే అర్ధమైందేమో అందుకే లెక్కింపు కేంద్రం నుంచి సగంలోనే వెళ్లిపోయాడు. బెంగళూరు సెంట్రల్​ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశాడీ బహుభాషా నటుడు.

ప్రస్తుతం ఈ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న పీసీ మోహన్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశ్​రాజ్​కు ఆయనకు ఓట్ల వ్యత్యాసంలో భారీ తేడా ఉంది. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఈ నటుడు... తను ఓడిపోవడం ఖాయమనే ఉద్దేశంతో ట్వీట్ చేశాడు.

"ఈ పరిస్థితి చూస్తే నాకు చెంపదెబ్బ కొట్టినట్టయింది. నేను నా మాటలపైనే నిలబడతాను. లౌకిక భారతదేశ నిర్మాణం కోసం ఎప్పటికీ కృషి చేస్తాను. కష్టమైన ఈ దారిలో ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు తోడ్పడిన వారందరికి కృతజ్ఞతలు" -ప్రకాశ్ రాజ్, నటుడు

బెంగళూరు సెంట్రల్​లో గత రెండు పర్యాయాలు(2009,2014) గెలిచిన భాజపా అభ్యర్థి మోహన్ ఈసారీ గెలుపొందారు.

Last Updated : May 23, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details