గతకొన్ని రోజుల నుంచి చర్చనీయాంశమైన 'మా' ఎన్నికల(MAA Elections 2021) నామినేషన్ సోమవారం ప్రారంభమైంది. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ 'మా' అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటల సమయంలో తన ప్యానల్ సభ్యులతో కలిసివచ్చి అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు.
"ప్రతి విషయంలో మేం ఒక అడుగు ముందే ఉన్నాం. ఇవి ఎన్నికలు కాదు.. పోటీ మాత్రమే. సవ్యంగా దూషారోపణ చేయకుండా ఎన్నికలు జరగాలి. అక్టోబరు 3న మా ఎన్నికల ప్రణాళిక వెల్లడిస్తా"
-- ప్రకాశ్‌రాజ్, సీనియర్ నటుడు
సిని'మా' బిడ్డలం పేరుతో(Prakash Raj Panel) తన ప్యానెల్ సభ్యుల జాబితాను ఇటీవల ప్రకటించారు ప్రకాశ్‌రాజ్.
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు
- అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్
- ట్రెజరర్-నాగినీడు
- జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి
- జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్
- ఉపాధ్యక్షుడు: బెనర్జీ
- ఉపాధ్యక్షురాలు- హేమ
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్- శ్రీకాంత్
- జనరల్ సెక్రటరీ- జీవితా రాజశేఖర్
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో ఈసీ మెంబర్స్ (ఎగ్జిక్యూటివ్ సభ్యులు)
- అనసూయ (వ్యాఖ్యాత, నటి)
- అజయ్
- బి.భూపాల్
- బ్రహ్మాజీ
- బుల్లితెర నటుడు ప్రభాకర్
- గోవిందరావు
- ఖయ్యూం
- కౌశిక్
- ప్రగతి
- రమణారెడ్డి
- శివారెడ్డి
- సమీర్
- సుడిగాలి సుధీర్
- డి.సుబ్బరాజు
- సురేశ్ కొండేటి
- తనీశ్
- టార్జాన్
అయితే తన ప్యానెల్‌లో బండ్ల గణేశ్‌ను అధికార ప్రతినిధిగా ఉంటారని ప్రకాశ్‌రాజ్(MAA Election Prakash Raj) అంతకుముందు వెల్లడించారు. ఆ తర్వాత తాను వేరుగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు బండ్ల గణేశ్. స్వతంత్ర సెక్రటరీగా పోటీ చేస్తానన్నారు.
అక్టోబర్ 10న(MAA Elections 2021 Date) జరగనున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఇప్పటివరకు త్రిముఖ పోరు నెలకొంది. ప్రకాశ్‌రాజ్‌తోపాటు(Prakash Raj Panel) మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు(Manchu Vishnu Movies) బరిలోకి దిగగా.. మరో సీనియర్ నటుడు సీవీల్ నర్సింహారావు స్వతంత్ర అభ్యర్థిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA Elections 2021) ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
MAA Elections 2021: 'చిరు నాకే ఓటు వేస్తారు'
MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ ఇదే