కరోనా సమయంలో నిస్సహాయులకు అపన్నహస్తం అందించి, మానవత్వాన్ని చాటుకున్న బాలీవుడ్ నటుడు సోనుసూద్‌ను విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ మర్యాదపూర్వకంగా సన్మానించారు. రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతున్న 'అల్లుడు అదుర్స్' సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన్ను, సెట్లో ప్రకాశ్‌రాజ్ తోపాటు చిత్ర యూనిట్ సాధార స్వాగతం పలికి గౌరవించింది.
సోనూసూద్‌ను సన్మానించిన ప్రకాశ్‌రాజ్ - sonu sood latest news
హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌కు హాజరైన నటుడు సోనూసూద్‌ను.. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ సన్మానించారు. లాక్డౌన్లో నిస్సహాయులకు చాలా విధాలుగా సాయం చేశారు సోనూ.
![సోనూసూద్‌ను సన్మానించిన ప్రకాశ్‌రాజ్ prakash raj facilitate sonu sood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8970827-115-8970827-1601293029094.jpg)
సోనూసూద్ ప్రకాశ్‌రాజ్
సోనూసూద్‌ను సన్మానించిన ప్రకాశ్‌రాజ్
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'అల్లుడు అదుర్స్'. ఇటీవలే చిత్రీకరణ పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా కీలక పాత్ర పోషిస్తున్న సోనుసూద్... సెట్లో అడుగుపెట్టడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.
Last Updated : Sep 28, 2020, 5:26 PM IST