మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ఆ వేడి ఇంకా చల్లారడం లేదు. ఓ వైపు ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు(maa elections manchu vishnu panel) .. ప్రకాశ్ రాజ్, నాగబాబుల రాజీనామాలను ఆమోదించేది లేదని స్పష్టం చేస్తుండగా... ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ పోలింగ్ సెంటర్ లో ఉన్న సీసీ కెమెరా పుటేజీని ప్రకాశ్ రాజ్(maa elections prakashraj panel) పరిశీలించారు. తన ప్యానల్ సభ్యులు శ్రీకాంత్, బెనర్జీ, తనీశ్, రమణారెడ్డిలతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కు వచ్చిన ప్రకాశ్ రాజ్... పోలీసుల సమక్షంలో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. సుమారు గంటన్నరపాటు సీసీ కెమెరా పుటేజీని పరిశీలించిన ఆయన... త్వరలోనే మిగతా పుటేజీని చూస్తామని తెలిపారు. సీసీ పుటేజ్ చూడటానికి విష్ణు అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Maa elections 2021: ఆయనతోనే మాకు సమస్య: ప్రకాశ్‌రాజ్ - మంచు విష్ణు న్యూస్
ఇటీవల 'మా' ఎన్నికలు(maa elections 2021) నిర్వహించిన అధికారితోనే తమకు సమస్య అని అధ్యక్ష బరిలో నిలిచి ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్(praksh raj panel) అన్నారు. ఫిర్యాదులపై ఆయన సరిగా స్పందించట్లేదని చెప్పారు.

విష్ణు తన ప్యానల్ సభ్యులతో పనిచేసుకుంటున్నారని, కేవలం ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌తోనే తమకు ఇబ్బందులున్నాయన్నారు ప్రకాశ్‌రాజ్. ఎన్నికల ప్రక్రియను 7 కెమెరాలతో చిత్రీకరించినట్లు కృష్ణమోహన్ తెలిపారని, ఆ పుటేజిని పరిశీలిస్తామని తెలిపారు. సీసీ పుటేజ్ విషయంలో ఎన్నికల అధికారి మాట తప్పారని ఆరోపించారు. పోలింగ్ సమయంలో మోహన్ బాబు, నరేష్ లు దురుసుగా ప్రవర్తించారని, ఆ కారణంగానే తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రకాశ్ రాజ్.... తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: