తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరుతో ప్రకాశ్​రాజ్​ భేటీ.. మోహన్​లాల్​ కొత్త సినిమా షురూ - మోహన్​లాల్​ కొత్త సినిమా

టాలీవుడ్​ అగ్రహీరో​ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు విలక్షణ నటుడు ప్రకాశ్​ రాజ్​. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. మెగాస్టార్​ లాంటి సోదరుడు తనకు దొరకడం అదృష్టమని పేర్కొన్నారు. దీంతో కొన్ని టాలీవుడ్​ చిత్రాల అప్​డేట్లు వచ్చేశాయి.

Prakash Raj with Chiranjeevi
చిరంజీవితో ప్రకాశ్​రాజ్​

By

Published : Aug 17, 2021, 2:25 PM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఎంతో కృషి చేస్తున్నారని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కొనియాడారు. అలాంటి సోదరుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ ఉదయం ఫిల్మ్ నగర్ అపోలో ఆసుపత్రి జిమ్​లో చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమైన ప్రకాశ్ రాజ్.. చిత్రపరిశ్రమలో ఇటీవల నెలకొన్న పరిణామాలపై కాసేపు చర్చించారు. మరోవైపు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్​కు చిరంజీవి మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ఇరువురి జిమ్ భేటీ చిత్ర పరిశ్రమలో ప్రాధాన్యం సంతరించుకుంది.

చుక్కల మేళం దిక్కుల తాళం..

సుధీర్‌ బాబు కథానాయకుడిగా దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్‌'. ఆనంది కథానాయిక. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాను ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ మెలొడీని విడుదల చేసింది చిత్ర బృందం. 'చుక్కల మేళం దిక్కుల తాళం' అంటూ సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది.

సుధీర్‌- ఆనంది జోడీ కనువిందు చేస్తోంది. ఇద్దరి హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి నేపథ్యంలో రూపొందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో సూరిబాబుగా కనిపించనున్నారు సుధీర్‌. శ్రీదేవిగా ఆనంది సందడి చేయనుంది. నరేశ్‌, రఘుబాబు, అజయ్‌, సత్యం రాజేశ్‌, హర్షవర్ధన్‌ తదితరులు ఈ మూవీలో కనిపించనున్నారు.

ఇదీ చదవండి:థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఎప్పటికో?

రిలీజ్​ డేట్​ వచ్చేసింది..

టాలీవుడ్​ యువహీరో సుశాంత్​ కొత్త సినిమా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' రిలీజ్​కు సిద్ధమైంది. ఈ మూవీ ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్​ జారీ చేసింది సెన్సార్​ బోర్డు.

ఈ చిత్రంతో దర్శన్​ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మోహన్​లాల్​ కొత్త సినిమా..

మలయాళ నటుడు మోహన్​లాల్​, దర్శకుడు జీతూ జోసెఫ్​ కాంబినేషన్​లో మరో సినిమాకు రంగం సిద్ధమైంది. '12th Man' పేరుతో వస్తున్న ఈ మూవీ షూటింగ్​ ఈరోజు ప్రారంభమైంది. ఆంటోనీ పెరుంబావుర్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిల్​ జాన్సన్​ మ్యూజిక్​ డైరెక్టర్​గా పనిచేస్తున్నారు.

గతంలో వీరిద్దరీ కాంబినేషన్​లో 'దృశ్యం' సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. ఆ చిత్రం భారత్​లోనే కాక లండన్​, అమెరికాలోనూ విశేషాదరణ దక్కించుకుంది.

ఇదీ చదవండి:Shankar Birthday: కథలతో ప్రయోగాలు.. సినిమాలతో సంచలనాలు!

ABOUT THE AUTHOR

...view details