తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్​ సినిమాలో ప్రగ్యాకు ఆఫర్​.. అంతలోనే! - pragya jaiswal salman khan

pragya jaiswal antim: హీరోయిన్​ ప్రగ్యాజైశ్వాల్​కు ఓ బంపర్​ ఆఫర్​ చేజారిందట! సల్మాన్​ఖాన్​​ హీరోగా విడుదలైన 'అంతిమ్​: ది ఫైనల్​ ట్రూత్​'లో మొదట ఆమెకు అవకాశం వచ్చిందని, కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల అది చేజారిందని తెలిసింది.

సల్మాన్​ ఖాన్​ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్​, pragya jaiswal antim, pragya jaiswal salman khan
సల్మాన్​ ఖాన్​ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్​

By

Published : Nov 27, 2021, 3:22 PM IST

pragya jaiswal salman khan: కెరీర్‌లో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు నటి ప్రగ్యాజైశ్వాల్‌. ప్రస్తుతం 'అఖండ'ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్న ప్రగ్యా గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది(balakrishna akhanda movie). అనుకోని కారణాల వల్ల తన ప్రమేయం లేకుండానే ఓ బంపర్‌ ఆఫర్‌ చేజారిందట.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌'(salmankhan antim movie). మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్‌ శర్మ కీలకపాత్ర పోషించారు. గ్యాంగ్‌స్టర్స్‌, పోలీసులకు మధ్య జరిగే పోరాటాల కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్‌ పోలీస్‌ అధికారిగా కనిపించారు. అయితే, సల్మాన్‌ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఆయనపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరించాలని మొదట చిత్రబృందం భావించిదట. ఆ పాటలో సల్మాన్‌ సరసన డ్యాన్స్‌ చేయడానికి నటి ప్రగ్యాజైశ్వాల్‌ను టీమ్‌ సంప్రదించగా.. ఆమె ఓకే కూడా అన్నారట. తీరా సినిమా షూట్‌ ప్రారంభమయ్యాక.. సీరియస్‌ కంటెంట్‌లో రొమాంటిక్ సాంగ్‌ ఉండకపోతేనే బాగుంటుందని టీమ్‌ నిర్ణయించుకొని ప్రగ్యాకి తెలియజేశారట.

ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ప్రగ్యా టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు.. ఈ ఆఫర్‌ ప్రగ్యా చేతికి వచ్చి ఉంటే బాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చి ఉండేదని నెటిజన్లు చెప్పుకొంటున్నారు.


ఇదీ చూడండి: కథ వినకుండానే 'అఖండ' చేశా: హీరోయిన్ ప్రగ్యా

ABOUT THE AUTHOR

...view details