'కంచె' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది ప్రగ్యా జైస్వాల్. అప్పటి నుంచి కొన్ని సినిమాల్లో నటించినా సరైన హిట్ మాత్రం దొరకలేదు. అయితే ప్రస్తుతం ఈ మద్దుగుమ్మ బాలీవుడ్లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సరసన ప్రగ్యాకు ఛాన్స్! - సల్మాన్ ఖాన్ అంతిమ్‌లో ప్రగ్యా జైస్వాల్
'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్లో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. ఈ అమ్మడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.
![బాలీవుడ్ సూపర్‌స్టార్ సరసన ప్రగ్యాకు ఛాన్స్! Pragya Jaiswal to pair up with Salman Khan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10431684-457-10431684-1611971588837.jpg)
బాలీవుడ్ సూపర్‌స్టార్ సరసన ప్రగ్యాకు ఛాన్స్!
ప్రగ్యా.. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'అంతిమ్'. ఇందులో ఇతడు సిక్కు పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఇతడికి జోడీగా ప్రగ్యా మెరవనుందట.
ప్రస్తుతం ప్రగ్యా తెలుగులో బాలకృష్ణ సరసన నటిస్తోంది. బోయపాటి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.