తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నీలి నీలి ఆకాశానికి రికార్డు స్థాయిలో వ్యూస్​ - 30రోజుల్లో ప్రేమించడం ఎలా?

యాంకర్ ప్రదీప్​ మాచిరాజు తెరంగేట్రం చేస్తున్న '30రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాలోని 'నీలి నీలి ఆకాశం' వీడియో సాంగ్​కు యూట్యూబ్​లో 16 కోట్ల వ్యూస్​ వచ్చాయి. అసలు సినిమా విడుదల కాకుండానే ఓ డెబ్యూ హీరో సినిమా పాటకు ఈ స్థాయిలో వ్యూస్ రావడం అంటే రికార్డు అని చెప్పుకోవాలి.

Pradeep's neeli neeli song gets record views in youtube
నీలి నీలి ఆకాశానికి రికార్డు స్థాయిలో వ్యూస్​

By

Published : Aug 6, 2020, 8:46 PM IST

Updated : Aug 6, 2020, 9:00 PM IST

ప్రముఖ తెలుగు యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం '30రోజుల్లో ప్రేమించడం ఎలా?' కథానాయికగా అమృత అయ్యర్ నటిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన సినిమాలోని 'నీలి నీలి ఆకాశం...' వీడియో సాంగ్‌ ఇప్పుడు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ పాట 16 కోట్ల వ్యూస్‌ని దక్కించుకుంది. చంద్రబోస్‌ రాసిన సాహిత్యానికి సిధ్ శ్రీరామ్, సునీత ఆలపించగా అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు.

కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఓటీటీలో విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుండగా, అందుకు చిత్ర నిర్మాతలు సుముఖంగా లేరని సమాచారం. అసలు సినిమా విడుదల కాకుండానే ఓ డెబ్యూ హీరో సినిమా పాటకు ఈ స్థాయిలో వ్యూస్ రావడం అంటే రికార్డు అని చెప్పుకోవాలి. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్‌, హేమ, వైవా హర్ష తదితరులు నటిస్తున్నారు.

ఇదీ చూడండి:-'అంధాధున్' రీమేక్​లో నయనతార!

Last Updated : Aug 6, 2020, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details