తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సెప్టెంబరులోనే ప్రభుదేవా రహస్య వివాహం!

స్టార్ డైరెక్టర్ ప్రభుదేవా, సెప్టెంబరులోనే ఆత్మీయుల మధ్య వివాహం చేసుకున్నట్లు బాలీవుడ్​ వర్గాలు సమాచారం. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఇంతకు ముందు రామలతను పెళ్లి చేసుకుని, 2010లో విడాకులు ఇచ్చేశారు ప్రభు.

By

Published : Nov 20, 2020, 1:45 PM IST

Prabhudheva got married to a physiotherapist in Mumbai in September
బిహార్​కు చెందిన డాక్టర్​తో ప్రభుదేవా రహస్య వివాహం!

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా.. త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబరులో అతడి బిహార్​కు చెందిన ఓ డాక్టర్​ను వివాహం చేసుకున్నారని సమాచారం. ముంబయిలోని గ్రీన్ ఎకర్స్ ఇందుకు వేదికైందని తెలుస్తోంది. ఈ జంట ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటోందట.

అలా పరిచయం

గతంలో వెన్నెముకకు చికిత్స చేయించుకునేందుకు ప్రభుదేవా, సదరు ఫిజియోథెరపిస్టును కలిశారట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. కొంతకాలం డేటింగ్​లో ఉన్న వీరిద్దరూ.. సెప్టెంబరులో రహస్య వివాహం చేసుకున్నారని ప్రభుదేవా సన్నిహితులు చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఆయన మేనేజర్​ ధ్రువీకరించలేదు.

నయన్​తో ప్రేమాయణం

ప్రభుదేవా, 1995లో రామలతను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో పెద్ద కుమారుడు కాన్సర్​తో 2008లో మరణించాడు. 2011లో రామలత నుంచి విడాకులు తీసుకున్నాడు ప్రభు. ఆ తర్వాత ఆయన నయనతారతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనేక వివాదాల తర్వాత 2012లో వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details