తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభుదేవా 'ముక్కాబులా' పాట పుట్టిందిలా! - ముక్కాబులా పాట పాడాడిలా

తెలుగు సినీ అభిమానుల మనసు దోచి, శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ప్రేమికుడు చిత్రంలోని 'ముక్కాలా ముక్కాబులా' పాట వెనక ఓ పెద్ద కథే ఉంది. సంగీత దర్శకుడు రెహమాన్... సింగర్​ మనోతో ఈ పాటను భిన్నంగా ఎలా పాడించారంటే?

mukkala mukkabula song idea
'ముక్కాబులా' పాట పుట్టిందిలా!

By

Published : Jan 1, 2021, 4:16 PM IST

'ముక్కాలా ముక్కాబులా లైలా హో లైలా'.. సినీ అభిమానుల్ని ఓ ఊపు ఊపిన పాట. అందుకే కొత్తగా ఎన్ని పాటలు పుట్టుకొచ్చినా 'ముక్కాబులా' స్థానం చెక్కుచెదరదు అనేది సంగీత ప్రియుల మాట. అందులోని మ్యాజిక్‌ అలాంటిది.

'ప్రేమికుడు' చిత్రం కోసం ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించగా.. మనో పాడారు. ఇందులో మనో స్వరం గమ్మత్తుగా ఉంటుంది. ఆయన అప్పటి వరకు పాడిన పాటలకు ఈ పాటకు సంబంధం ఉండదు. మనో జీవితం 'ముక్కాలా' పాటకు ముందు, తర్వాత అనేలా మారిందంటే ఏ రేంజ్‌లో అలరించిందో అర్థమవుతుంది.

అసలు కథ ఇదే?

సంగీత దర్శకుడు, రచయిత మనోను తెల్లవారు జామున 3 గంటలకు ఈ పాట పాడాలన్నారట. వేర్వేరు వాయిస్‌లతో విభిన్నంగా ఉండేలా ప్రయత్నించినప్పటికీ వాళ్లకు నచ్చలేదు. సంగీతం ఉంటే పాట పాడటం కాదు, నీ స్వరానికే సంగీతం ఇచ్చేలా చేయమన్నారట రెహమాన్‌. ఉదయాన్నే ఈ ఛాలెంజ్‌ అవసరమా అనుకుని టీ కోసం రికార్డింగ్‌ థియేటర్‌ నుంచి మనో బయటకు వెళ్లారట. టీ తాగుతుండగా అక్కడున్న ఓ వాచ్‌మెన్‌ హిందీలో పాడుతుంటే అది విని, వెంటనే రెహమాన్‌ దగ్గరకు వెళ్లి అదే విధానంలో పాడి చూపించారట. 'చాలా బావుంది. కొనసాగించు .. చరణం మొదలు పెట్టు అంటూ' రెహమాన్‌ పదిహేను నిమిషాల్లో పాటను పూర్తి చేయించారు. అలా ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు మనో.

ఇదీ చదవండి:బ్రహ్మానందం నుంచి బన్నీకి ఊహించని గిఫ్ట్

ABOUT THE AUTHOR

...view details