ప్రభుదేవా అంటే సల్మాన్‌కి ఎంతో గురి. ఈ మధ్యే ఇద్దరి కలయికలో 'దబంగ్ 3' వచ్చింది. త్వరలో 'రాధే' రానుంది. తాజాగా సల్మాన్‌ఖాన్ ప్రభుదేవాకి మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
మరోసారి ప్రభుదేవాతో సల్మాన్ ఖాన్..! - సల్మాన్‌ఖాన్ ప్రభుదేవా సినిమా
సల్మాన్‌ఖాన్‌కు ఏ దర్శకుడిపైనైనా గురి కుదిరిందంటే ఆ దర్శకుడితో మళ్లీమళ్లీ పనిచేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన ప్రభుదేవాతో కలిసి మరోసారి పనిచేయనున్నాడట.
మరోసారి ప్రభుదేవాతో సల్మాన్..!
టైగర్ సిరీస్ చిత్రాల్లో వచ్చిన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' మంచి విజయం సాధించాయి. ఈ సిరీస్‌లో మూడో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాని దర్శకత్వ బాధ్యతలు ప్రభుదేవాకి అప్పగించినట్లు బాలీవుడ్ గుసగుసలు.
ఇదీ చదవండి:'గ్రామీ' అవార్డును లోదుస్తులతో స్వీకరిస్తాం!
Last Updated : Feb 18, 2020, 5:02 AM IST