తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకోనున్నారా? - prabudeva second marriage rumours

కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా.. తన బంధువల అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోనున్నారట. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ, సల్మాన్​ సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.

Prabhu Deva
ప్రభుదేవా

By

Published : Nov 13, 2020, 11:23 AM IST

నృత్యదర్శకుడు ప్రభుదేవా రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నారా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం తన మేనకోడలుతో రిలేషిన్​షిప్​లో ఉన్నట్లు, త్వరలోనే వీరిద్దరూ వివాహం జరగనున్నట్లు సమాచారం.

ప్రభు, తన భార్య రామలత మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల కొనేళ్ల క్రితమే విడిపోయారు. ఆ తర్వాత ఓ హీరోయిన్​తో ప్రేమాయాణం నడిపినట్లు, పెళ్లి కూడా చేసుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే ప్రభు, తన మేనకోడలిని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.

బాలీవుడ్​లో సల్మాన్​ ఖాన్​ 'రాధే' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ప్రభుదేవా. తమిళంలో 'పొన్​ మనిక్కావెళ్'​, 'థీల్'​, 'యంగ్​మంగ్​ సంగ్'​, 'ఊమయ్​ విఝిగల్'​, 'భగీర్'​ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details