దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి లవర్‌బాయ్‌గా ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రేమకథా సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్. ఉగాది పండగను పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మంగళవారం (ఏప్రిల్ 13)న దేశవ్యాప్తంగా అనేక పండగలను జరుపుకొంటోన్న సందర్భంగా.. "ఎన్నో పండగలు.. ఒక్కటే ప్రేమ" అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
రాధేశ్యామ్: పండగలు ఎన్నో.. ప్రేమ ఒక్కటే! - రాధేశ్యామ్ పోస్టర్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా నుంచి ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పండగలు ఎన్నైనా ప్రేమ ఒక్కటైనని ప్రభాస్ చెప్పిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
రాధేశ్యామ్
70ల నాటి ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే ఈ చిత్రానికి దక్షిణాదిలోని అన్ని భాషల్లో జస్టిన్ ప్రభాకరన్, హిందీ వెర్షన్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీతం అందించనున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 30న సినిమా విడుదల కానుంది.
ఇదీ చూడండి:'మా అభిప్రాయాలు వేరైనా భావజాలం ఒక్కటే!'