తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ సంక్షోభ పరిస్థితులు మళ్లీ రాకూడదు'​ - రాధేశ్యామ్​ చిత్రబృందం విరాళం

ప్రముఖ సినీ నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్​ కరోనా పోరాటంలో భాగంగా.. 'రాధేశ్యామ్​' సినిమాలో ఉపయోగించిన హాస్పిటల్​ సెట్​ ప్రాపర్టీని కొవిడ్​ సంరక్షణ కేంద్రానికి తరలించింది. ఈ నేపథ్యంలో దీని గురించి ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి. రీల్ కోసం వేసిన సెట్లో​ని వస్తువులు రియల్ లైఫ్​లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడటం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

RADHE SHYAM
రాధేశ్యామ్​ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి

By

Published : May 11, 2021, 8:52 PM IST

Updated : May 11, 2021, 9:17 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ సృష్టిస్తున్న విలయతాండవానికి జనం అల్లాడిపోతున్నారు. కరోనా బారిన పడి విషమంగా ఉన్నవారికి ఆస్పత్రుల్లో పడకలు దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్ర బృందం సామాజిక బాధ్యత చాటుకుంది. రాధేశ్యామ్ సినిమా కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆస్పత్రి సెట్​లోని ఒరిజినల్​ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, సెలైన్ స్టాండ్లను ఓ ప్రైవేటు ఆస్పత్రికి విరాళంగా అందజేసింది.

నెలన్నర రోజులపాటు ఆ ఆస్పత్రిలో ప్రభాస్, పూజాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం.. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రీల్ కోసం వేసిన సెట్లో​ని వస్తువులు రియల్ లైఫ్​లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడటం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి. అయితే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని వేడుకున్నారు. తన భార్య ఇచ్చిన సలహాతోనే ఇదంతా జరిగిందని చెప్పారు. దీంతోపాటే ఈ సినిమా కోసం ఆస్పత్రి నిర్మాణం ఎలా సాగిందో వివరించారు.

రాధేశ్యామ్​ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి
Last Updated : May 11, 2021, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details