డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం ఓ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ దర్శకుడు. ఇటీవలే జార్జియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిత్రబందమంతా, హోం క్వారంటైన్లో ఉంది. అయితే టైటిల్, ఫస్ట్‌లుక్ గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంపై అభిమానులు కోపంగా ఉన్నారు. ఈ విషయమై తాజాగా ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్.
కరోనా తీవ్రత తగ్గిన వెంటనే #ప్రభాస్20 అప్డేట్స్ - సినిమా వార్తలు
హీరో ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్స్పై స్పష్టతనిచ్చింది నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్. ఈ వైరస్ తీవ్రత తగ్గిన వెంటనే వాటిని అభిమానులతో పంచుకుంటామని ట్వీట్ చేసింది.
హీరో ప్రభాస్
ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని తాత్కాలికంగా ఆపేశామని, కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మరిన్ని అప్డేట్స్ పంచుకుంటామని చెప్పింది చిత్రబృందం. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరింది.
ఈ సినిమా కోసం 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే పేర్లను ఇప్పటికే రిజిస్టర్ చేయించారు. కానీ వీటిలో ఏది ఇంకా ఖరారు చేయలేదు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.