కరోనా వైరస్‌ను లెక్కచేయకుండా ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ సాగుతోంది. ప్రస్తుతం జార్జియాలో ఉన్న చిత్రబృందం, అక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశాడు. సహకరించిన జార్జియా బృందానికి కృతజ్ఞతలు చెప్పాడు. త్వరలో #ప్రభాస్20 ఫస్ట్‌లుక్ రానుందని రాసుకొచ్చాడు.
త్వరలో డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ - ప్రభాస్ 20 అప్డేట్
హీరో ప్రభాస్ కొత్త సినిమా జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన దర్శకుడు.. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నామని రాసుకొచ్చాడు.

ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ అపుడేనా..!
సినీ వర్గాల సమచారం ప్రకారం ఉగాది కానుకగా ఈ లుక్‌ను విడుదల చేసే అవకాశముంది. పీరియాడికల్ కథతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా రానుందీ చిత్రం.
ఇదీ చూడండి.. అలీ ఇచ్చిన ఆ గిఫ్ట్‌ను భద్రంగా దాచుకున్న ప్రదీప్