రెబల్‌స్టార్ ప్రభాస్(prabhas adipurush look) వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నారు. ఇందులో ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్' షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. 'ఆదిపురుష్'ను త్రీడీలోనూ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11(prabhas adipurush release date)న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే వెల్లడించింది చిత్రబృందం. అందుకు తగ్గట్లే శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రాముడి పాత్రలో నటిస్తోన్న ప్రభాస్ తన పాత్ర షూటింగ్‌ను పూర్తి చేసినట్లు తెలిపింది చిత్రబృందం. దీంతో అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.
'ఆదిపురుష్' షూటింగ్‌ను ముగించిన ప్రభాస్ - ఆదిపురుష్ ముగించిన ప్రభాస్
రెబల్‌స్టార్ ప్రభాస్(prabhas movies) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్‌ను ముగించుకున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్
ఈ సినిమాలోని తమ పాత్రల షూటింగ్‌లను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు రావణ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్, సీత పాత్రధారి కృతి సనన్. భారీ వీఎఫ్క్స్తో రూపొందుతోన్న ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లకు రావాలంటే వీలైనంత తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని చూస్తోంది చిత్రబృందం.
ఇవీ చూడండి: ఆ సన్నివేశాలు మా సినిమాకు హైలైట్: విశాల్
Last Updated : Nov 4, 2021, 11:38 AM IST