కరోనా ప్రభావంతో చాలావరకు సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. నటీనటులు కూడా దాదాపుగా ఇంటికే పరిమితమయ్యారు. కానీ డార్లింగ్ ప్రభాస్ మాత్రం పలు జాగ్రత్తలతో చిత్రీకరణలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. ఏక కాలంలో రెండు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారట.
ప్రభాస్.. 'సలార్', 'ఆదిపురుష్' కోసం ఒకేసారి!
అగ్రకథానాయకుడు ప్రభాస్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకుని, ఏకకాలంలో షూటింగ్‌లకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారట.
ప్రభాస్
'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ముంబయిలో చిత్రీకరణలపై తాత్కాలిక నిషేధం విధించడం వల్ల 'ఆదిపురుష్' టీమ్ కూడా ఇప్పుడు హైదరాబాద్‌కే వచ్చేసింది. దీంతో ఏకకాలంలో రెండు షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు డార్లింగ్ హీరో రెడీ అవుతున్నారు.
ఇది చదవండి:15 రకాల బిర్యానీలు ఒకేసారి తిన్నా: ప్రభాస్