తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ అభిమాన హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ - telugu cinema news

హీరో అల్లు అర్జున్ అభిమాన హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ఉన్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతడే చెప్పాడు. టాలీవుడ్​లో వారే టాప్ అంటూ ఓ ముగ్గురి పేర్లు వెల్లడించాడు.

బన్నీ అభిమాన హీరోల్లో డార్లింగ్ ప్రభాస్
అల్లు అర్జున్-ప్రభాస్

By

Published : Jan 11, 2020, 4:28 PM IST

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్.. టాలీవుడ్​ టాప్-3 హీరోలు ఎవరో చెప్పేశాడు. 'అల వైకుంఠపురములో' ప్రచారంలో భాగంగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఈ కథానాయకుడు.. రిపోర్టర్​కు ఆసక్తికర సమాధానమిచ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పేందుకు ముగ్గురు నటుల్ని ఎంపిక చేయాలంటే ఎవర్ని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ పేర్లు చెప్పాడు బన్నీ.

'అల వైకుంఠపురములో' సినిమాలో హీరో అల్లు అర్జున్

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. టబు, సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ అందించిన పాటలు ఇప్పటికే మార్మోగిపోతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. రేపు(ఆదివారం) ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: అల్లు అర్జున్​కు రౌడీ హీరో సర్​ప్రైజింగ్ గిఫ్ట్

ABOUT THE AUTHOR

...view details