తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​ను టచ్​ చేసింది.! - rebal star

నచ్చిన హీరో ఎదురుగా కనిపిస్తే అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆ ఆనందానికి హద్దులు ఉండవు. అందుకే కొన్నిసార్లు ఫ్యాన్స్​ తాకిడి తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు స్టార్లు. అలాంటి విభిన్న సంఘటనే యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​కు ఎదురైంది.

ప్రభాస్​ను టచ్​ చేసింది.

By

Published : Mar 5, 2019, 6:02 PM IST

Updated : Mar 5, 2019, 11:25 PM IST

ఎయిర్​పోర్టు నుంచి బయటకు వస్తోన్న డార్లింగ్​ను చూసి....అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆ సమయంలో ఫోటో కావాలంటూ దగ్గరకు వెళ్లిందో యువతి. ఫోటో తీసుకున్న తర్వాత ఊరుకోకుండా రెబల్​ హీరో చెంపపై చిన్నగా కొట్టి వెళ్లిపోయింది. వెంటనే ప్రభాస్​ తన చెంపను రుద్దుకుంటూ నవ్వుకున్నాడు. ఆ యువతి ప్రభాస్‌ చెంపను తాకినప్పుడు ఓ అభిమాని తీసిన వీడియో ఇన్‌స్టాలో వైరల్​ అవుతోంది.

  • ప్రభాస్​ త్వరలో సాహో చిత్రంతో అలరించనున్నాడు. ఇటీవల కథానాయిక శ్రద్ధా కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2’ పేరుతో ఓ వీడియో విడుదలైంది. మేకింగ్​ వీడియోను చూస్తే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated : Mar 5, 2019, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details