టాలీవుడ్‌లో ప్రభాస్, కాజల్ జోడీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం 'డార్లింగ్'. ఆ తర్వాత 'మిస్టర్ పర్‌ఫెక్ట్'లో కలిసి నటించారు. ఈ సినిమా విడుదలై దాదాపు 9 ఏళ్లు అవుతోంది. మళ్లీ ఎప్పుడెప్పుడు ఈ జంటను చూస్తామా? అని ఎదురు చూశారు సినీ అభిమానులు. ఇకపై ఎదురుచూపులు అవసరం లేదని, ప్రభాస్- కాజల్ మరో క్రేజీ ప్రాజెక్టులో కలిసి నటిస్తున్నారంటూ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
తొమ్మిదేళ్ల తర్వాత 'డార్లింగ్'తో మరోసారి..? - kajal agarwal
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ కనిపించనుందట.
![తొమ్మిదేళ్ల తర్వాత 'డార్లింగ్'తో మరోసారి..? prabhas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5272789-thumbnail-3x2-prabhas.jpg)
ప్రభాస్
'జిల్' ఫేం రాధాకృష్ణ.. ప్రభాస్‌తో ఓ ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు. 'జాన్' అనే పేరుతో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైంది. పూజాతోపాటు కాజల్ కూడా ఈ చిత్రంలో నటించబోతుందంటూ టాలీవుడ్ టాక్. అయితే కాజల్ ఓ ప్రత్యేక పాత్రలో మాత్రమే కనిపిస్తుందట. పునర్జన్మల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశాల్లో ప్రభాస్ సరసన కాజల్ దర్శనమివ్వబోతుందని తెలుస్తోంది. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి.. మెగా ప్రిన్స్ కోసం ఆ రచయిత, దర్శకుడు