'సాహో' కథానాయకుడు ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా నటుడిగా మారిపోయారు. ఆయన 'బాహుబలి' చిత్రం తరువాత నటించే ప్రతి చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఆయన బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని చెప్పుకొంటున్నారు.
బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌తో ప్రభాస్! - వార్ దర్శకుడితో ప్రభాస్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా మరో చిత్రం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
సిద్ధార్థ్ గతంలో 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్'లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన షారుక్ ఖాన్‌తో పాటు హృతిక్ రోషన్‌లతో సినిమాలు చేస్తున్నారు. ఇక ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రంలో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయిక. ఇక 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి 'సలార్' చేస్తున్నారు. శుక్రవారం సినిమా షూటింగ్ ప్రారంభమైంది.