యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం 'సలార్'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఇటీవలే సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ గన్ పట్టుకొని కూర్చున్న లుక్ ప్రేక్షకులలో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
ప్రభాస్ కొత్త చిత్రం 'సలార్' కథాంశం ఇదేనా! - గ్యాంగ్‌స్టర్‌గా ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ కొత్త చిత్రం 'సలార్' ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలైంది. ఈ పోస్టర్‌లోని ప్రభాస్ వైల్డ్ లుక్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మాఫియా నేపథ్యంలో సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ కొత్త చిత్రం 'సలార్' కథాంశం ఇదేనా!
మరోవైపు ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ రివీల్ అయినట్లు తెలుస్తోంది. రివేంజ్ డ్రామాగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పేరుమోసిన గ్యాంగ్ లీడర్‌గా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్... ముంబయి మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. 'సలార్' చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి:'ఆదిపురుష్' వివాదంపై సైఫ్ క్షమాపణలు