'బాహుబలి' స్టార్ ప్రభాస్(Prabhas New Movie) ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన 'రాధేశ్యామ్' చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు 'ఆదిపురుష్', 'సలార్' సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయివి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి మరో కొత్త సినిమా(Prabhas 25th Movie) కబురు రానుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
ప్రభాస్ నటించినున్న 25వ చిత్ర వివరాలను(Prabhas 25th Movie Name) అక్టోబరు 7న ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దర్శకుడు, నిర్మాణసంస్థ, నటీనటుల వివరాలను అదే రోజున వెల్లడిస్తారు. ఇది రెబల్‌స్టార్ 25వ సినిమా కావడం వల్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.