తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ రికార్డు కొట్టిన తొలి దక్షిణాది నటుడు ప్రభాస్ - prabhas radhe shaym

ఫేస్​బుక్​లో 16 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకుని, ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది నటుడిగా ప్రభాస్ నిలిచారు. ఇతడు ప్రస్తుతం 'రాధేశ్యామ్'లో నటిస్తున్నారు.

ఆ రికార్డు కొట్టిన తొలి దక్షిణాది నటుడు ప్రభాస్
హీరో ప్రభాస్

By

Published : Jul 17, 2020, 9:59 AM IST

'బాహుబలి', 'సాహో' సినిమాలతో అభిమానగణాన్ని పెంచుకున్న డార్లింగ్ ప్రభాస్.. సోషల్ మీడియాలో మరో రికార్డు సృష్టించారు. ఫేస్​బుక్​లో 16 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. ఇందులో 1 మిలియన్ నుంచి 16 మిలియన్​ ఫాలోవర్లను అత్యంత త్వరగా అందుకున్న మొదటి నటుడు ప్రభాస్ కావడం విశేషం.

ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్​లుక్​ పోస్టర్​ను విడుదల చేయగా, 24 గంటల్లో 6.3 మిలియన్ ట్వీట్లతో రికార్డు సృష్టించింది.

'రాధేశ్యామ్' సినిమాలో ప్రభాస్-పూజా హెగ్డే

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. 1920ల నాటి యూరప్ నేపథ్య కథాంశంతో తీస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details