పాన్ ఇండియా చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రతి సినిమాలో అదిరిపోయే బాడీతో కనిపిస్తూ.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటారు డార్లింగ్. అయితే, ఆయన సిక్స్ ప్యాక్ వెనక ఫిట్నెస్ ట్రైనర్, మాజీ మిస్టర్ వరల్డ్ లక్ష్మణ్ ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రభాస్‌తో ఉంటున్న లక్ష్మణ్.. అతడికి ఇంట్లో వ్యక్తిగా కలిసిపోయారు.
జిమ్ ట్రైనర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్ - prabhas sixpack
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫిట్నెస్ ట్రైనర్‌కు ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఏకంగా రేంజ్ రోవర్ కారును కొనిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రభాస్
అయితే, లక్ష్మణ్‌కు పని పట్ల ఉన్న అంకితభావం, నిబద్దతకు మెచ్చి.. ఇటీవల ప్రభాస్ రేంజ్ రోవర్ కారును కొనిచ్చాడు. దీంతో లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడు.
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్', నాగ్ అశ్విన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే 'ఆదిపురుష్' పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను 3డీ ఎఫెక్ట్‌లో తెరకెక్కించబోతుండటం విశేషం.