తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Prabhas: ఆ రెండింటి కంటే ముందు.. ప్రభాస్ ఆ సినిమా కోసం - prabhas latest news

త్వరలో సినిమా షూటింగ్​లు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభాస్, మొదటగా 'రాధేశ్యామ్' సెట్​లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 'సలార్', 'ఆదిపురుష్' చిత్రీకరణకు హాజరుకానున్నారట.

Prabhas shooting restart with 'Radhe shyam'
ప్రభాస్

By

Published : Jun 13, 2021, 7:00 AM IST

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌', 'ఆది పురుష్‌', 'సలార్‌' చిత్రాలన్నీ కొవిడ్‌ పరిస్థితుల వల్ల తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులన్నీ క్రమంగా కుదుటపడుతుండటం వల్ల.. ఈ సినిమాల్ని తిరిగి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ఆయా చిత్ర బృందాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌ తొలుత ఏ చిత్రం కోసం రంగంలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్‌ తొలుత 'రాధేశ్యామ్‌' సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మరో వారం రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని.. జులై నుంచి చిత్రీకరణ పునఃప్రారంభించేందుకు ప్రణాళిక రచిస్తున్నారని ప్రచారం వినిపిస్తోంది.

ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక సెట్​ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇది పూర్తయిన వెంటనే ఆయన ‘సలార్‌’ కోసం రంగంలోకి దిగుతారని సమాచారం. అయితే ఈ రెండు చిత్రాల కన్నా ముందు ‘ఆదిపురుష్‌’ సెట్స్‌పైకి వెళ్లన్నుట్లు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడీ షెడ్యూల్‌ ముంబయిలోనే ప్లాన్‌ చేస్తున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

మహారాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరణలకు అనుమతిచ్చిన నేపథ్యంలో.. అక్కడే కొత్త షెడ్యూల్‌ పూర్తి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌ పాల్గొనరని సమాచారం. సైఫ్‌ అలీ ఖాన్‌ పాత్రపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తుంది. సైఫ్‌ ఈ చిత్రంలో లంకేష్‌ పాత్రలో కనిపించనుండగా.. ప్రభాస్‌ రాముడి పాత్రలో దర్శనమివ్వనున్నారు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details