'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబోలో 'సలార్' అనే కొత్త సినిమా రానున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. 'అత్యంత క్రూరమైన వ్యక్తి' అని పోస్టర్‌కు క్యాప్షన్ జోడించారు. దీంతో డార్లింగ్ అభిమానులు టైటిల్ అర్థాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు.
అర్థం ఇదే..
ఈ సినిమా బహుభాషా చిత్రం. అందుకే అన్ని భాషలకు సెట్టయ్యేలా 'సలార్' టైటిల్ నిర్ణయించారు. ఇది ఒక ఉర్దూ పదం. ధైర్యవంతుడైన నాయకుడు, దారిచూపువాడు అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే బలమైన నాయకుడన్నమాట.