రెబల్‌స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'సలార్'. ఇటీవల గోదావరిఖనిలో మొదలైన తొలి షెడ్యూల్ ఇప్పుడు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభాస్, శ్రుతి హాసన్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఓ ఛేజ్, కొంత టాకీ పార్ట్ తీశారు.
ప్రభాస్ 'సలార్' నుంచి మరో అప్డేట్ - ప్రశాంత్ నీల్ సలార్ మొదటి షెడ్యూల్ పూర్తి
డార్లింగ్ స్టార్ 'సలార్' అప్డేట్ వచ్చింది. తొలి షెడ్యూల్ పూర్తవగా, త్వరలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది.
![ప్రభాస్ 'సలార్' నుంచి మరో అప్డేట్ Prabhas Salaar first shedule completed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10543529-670-10543529-1612772541389.jpg)
ప్రభాస్ 'సలార్' మొదటి షెడ్యూల్ పూర్తి
ప్రభాస్'సలార్' నుంచి మరో అప్డేట్
'కేజీఎఫ్' నిర్మాతలు, ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు మధు గురుస్వామి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో చిత్రం విడుదల కానుందని సమాచారం.
ఇదే కాకుండా 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ సినిమాలు కూడా ఈ ఏడాది లేదంటే వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Last Updated : Feb 8, 2021, 3:19 PM IST