కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ ... అంటూ పోరాటాలు చేస్తుంటాడు ప్రభాస్. కానీ తెరపైన ఆయన చేసే యాక్షన్ ఘట్టాల్ని చూశాక ప్రేక్షకులకు అన్నీ నమ్మేయాలి అనిపిస్తుంది. అంతగా వాటిపై ప్రభావం చూపిస్తుంటారు ప్రభాస్. 'సలార్'లోనూ ఆయన యాక్షన్ ప్రత్యేకంగానే ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రుతి హాసన్ కథానాయిక. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
Prabhas Salaar: ఈ ఫైట్ 'సలార్' సినిమాకే హైలెట్! - prabhas salaar latest news
ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ 'సలార్' ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని సమాచారం. ఇందులో ప్రభాస్ అదిరిపోయేలా కనిపిస్తారని తెలుస్తోంది.
ప్రభాస్ సలార్ మూవీ
విరామ సమయంలో వచ్చే ఈ సినిమాలోని పోరాట ఘట్టాన్ని కొన్ని కీలక సన్నివేశాల్ని ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్లో ప్రభాస్ కనిపించే తీరు, భారీ హంగులతో సాగే పోరాట ఘట్టాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు సమాచారం. యాక్షన్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న ఈ 'సలార్'లో జగపతిబాబు రాజమన్నార్ అనే ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
ఇవీ చదవండి: