'బాహుబలి' సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. విదేశాల్లోనే క్రేజ్ సంపాదించాడు. ఇతడు నటించిన 'సాహో'.. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొంది, రూ.400 కోట్ల మేర కలెక్షను సాధించింది. ఇప్పుడు జపాన్‌లోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 27న అక్కడి వారిని పలకరించనుందీ చిత్రం. ఈ క్రమంలోనే 'సాహో' జపానీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆ సమయంలో థియేటర్లో పేపర్లు చింపి అరుస్తూ, గోలగోల చేస్తూ కనిపించారు జపాన్ దేశస్థులు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
జపాన్‌లో 'సాహో'.. ఈలలు వేస్తూ అభిమానులు గోలగోల - bahubali in japan
జపాన్‌లో ఇటీవలే విడుదలైంది 'సాహో' ట్రైలర్. అది ప్రదర్శితమవుతున్న సమయంలో అక్కడి థియేటర్లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.
saaho in japan
యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన 'సాహో'లో శ్రద్ధా కపూర్ హీరోయిన్. చుంకీ పాండే, మహేశ్ మంజ్రేకర్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
Last Updated : Feb 25, 2020, 4:27 PM IST