ప్రభాస్, పూజ హెగ్డే కాంబినేషన్లో రిలీజ్‌కు సిద్ధమవుతున్న సినిమా 'రాధేశ్యామ్'(prabhas radhey shyam movie). 'సాహో' తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, యానిమేటెషన్తో వచ్చిన తొలి పాట 'ఈ రాతలే' ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి 'రాధేశ్యామ్' స్టోరీ(radheyshyam story) ఇదేనంటూ చర్చించుకోవడం ప్రారంభించారు అభిమానులు. కొంత మంది పునర్జన్మల కథ, ఇంకొంత మంది టైమ్ ట్రావెల్ అని ఏవేవో ఊహించుకున్నారు. ఇక 'ఈ రాతలే' వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఓ మిస్టరీ ట్రైన్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోందని, కథ ఇదేనంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే?
1970లో యూరప్ నేపథ్యంగా సాగే ప్రేమకథ ఇది(prabhas upcoming movie radhe shyam). ఇందులో ఓ హాస్పిటల్‌లో ప్రేరణ(పూజా హెగ్డే) పని చేస్తున్నప్పుడు ప్రమాదంలో గాయపడ్డ విక్రమాదిత్యను(ప్రభాస్,) అక్కడికి తీసుకొస్తారు. ఆస్పత్రిలో ఆమె సేవలు, మనసును చూసి ప్రేమలో పడతారు విక్రమ్. అయితే.. పామిస్ట్ అయిన విక్రమాదిత్యకు ప్రేరణ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ముందే తెలిసిపోతుంది. ఆమెకు ఓ పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతుంది. అప్పటి నుంచి ప్రేరణ వెంటే ఉండి కాపాడుకుంటూ, ఆమె ప్రేమను విక్రమ్ ఎలా పొందారు అనేది కథ.
అయితే కథలో అసలు ట్విస్ట్ అక్కడే ఉందట. రాధేశ్యామ్ కథలో పునర్జన్మల నేపథ్యమూ ఉందట. ప్రభాస్‌కు ఇంటర్వెల్ ముందు తన గతం గుర్తుకు వస్తుంది. ఆ సమయంలోనే తను, తన ప్రేయసి చావు వెనుక ఓ మిస్టరీ ఉందని కనిపెడతారు. ఆ మిస్టరీ ఏంటన్న దాన్ని కనుగొనేందుకు హీరో చేసే ప్రయత్నాలతోనే ఈ సినిమా నడుస్తుందని తెలుస్తోంది.