Radhe shyam song: 'రాధేశ్యామ్' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. 'సంచారి' అంటూ సాగే పాట టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. పూర్తి పాటను 16వ తేదీన రిలీజ్ చేయనున్నారు. కాగా, 1970ల నాటి యూరప్ నేపథ్య కథతో 'రాధేశ్యామ్'ను తెరకెక్కించారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
'రాధేశ్యామ్' సాంగ్ టీజర్.. 'బ్రహ్మాస్త్ర' సర్ప్రైజ్ - రణ్‌బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్
కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమాలోని సంచారి సాంగ్‌కు సంబంధించిన టీజర్ ఉంది. పూర్తి పాటను 16వ తేదీన రిలీజ్ చేయనున్నారు. కాగా, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ డేట్ కూడా ఉంది.
Ranbir kapoor new movie Brahmastra: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఇందులో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌనిరాయ్ వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్‌పోస్టర్‌ను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీనికి బిగ్‌బీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రీతమ్ సంగీతమందిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదీ చూడండి: 'విరాట పర్వం' స్పెషల్ వీడియో.. 'బంగార్రాజు', 'ఖిలాడి' అప్డేట్స్