తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ నుంచి మరో సాంగ్​ రిలీజ్​ - రాధేశ్యామ్ సోచ్​లియా సాంగ్​ రిలీజ్​

RadheyShyam song Release: ప్రభాస్​, పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్'​ చిత్రంలోని 'సోచ్ ​లియా' సాంగ్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఇది శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది.

ప్రభాస్​ రాధేశ్యామ్​ సాంగ్​ రిలీజ్​, prabhas radheyshyam song release
ప్రభాస్​ రాధేశ్యామ్​ సాంగ్​ రిలీజ్​

By

Published : Dec 8, 2021, 2:01 PM IST

Radheyshyam song Release: ప్రభాస్​, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. విడుదల తేదీ దగ్గరపడేకొద్ది వరుస అప్డేట్స్​ను ప్రకటిస్తూ ఫ్యాన్స్​లో జోష్​ నింపుతోంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా​ హిందీ వెర్షన్​లోని మరో పాట 'సోచ్ ​లియా'ను విడుదల చేశారు. మిథూన్, అర్జిత్ సింగ్ ఆలపించిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ఇందులోని విజువల్స్​ రిచ్​గా కనిపించడం సహా సినిమాపై అంచనాలను కూడా మరింతగా పెంచుతోంది. అంతకుముందు విడుదలైైన 'ఆషికీ ఆగయి' పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా, ఈ మూవీలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్​' మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ABOUT THE AUTHOR

...view details