అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్'(prabhas radhesyam movie) సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఇందులోని ఫస్ట్ సాంగ్‌ను నవంబరు 15న సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. 1970ల నాటి యూరప్ నేపథ్య కథతో 'రాధేశ్యామ్' తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్(చేయి చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తి) కనిపించనున్నారు. ఆయన సరసన పూజాహెగ్డే హీరోయిన్గా చేస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'(Ghani Movie). ఈ చిత్రంలో నటిస్తున్న జగపతిబాబును ఈశ్వర్నాథ్గా పరిచయం చేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్‌ను నవంబరు 15న విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర(Upendra New Movie) కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.