Radheshyam second song teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్' నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన తొలి గీతం అలరిస్తుండగా, రెండో సాంగ్ టీజర్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లో రిలీజ్ చేసింది చిత్రబృందం. పూర్తి పాటను డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఈ సాంగ్ హిందీ వెర్షన్ టీజర్ ఉదయమే విడుదలై ఆకట్టుకుంటోంది.
1970 నాటి ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా చేసింది(prabhas pooja hegdey movie). ఇందులో ప్రభాస్ హస్తరేఖలు చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.