Radheshyam Update: రాధేశ్యామ్ సినిమా విడుదలైంది. సినిమా రివ్యూ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి Radheshyam review: ప్రేమకు, విధికి మధ్య జరిగిన యుద్ధంలో గెలుపెవరిది?
Prabhas radheshyam movie: దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా 'రాధేశ్యామ్' హడావుడి కనిపిస్తోంది. పాన్ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ చిత్రం మార్చి 11న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ లవర్‌బాయ్‌గా కనిపించడం, సినిమా కథాంశం, విజువల్ ఎఫెక్ట్స్‌తో టీజర్, ట్రైలర్ ఉత్కంఠంగా ఉండటం సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. అంతేకాక.. ఈ సినిమా ప్రచార చిత్రంలో ప్రభాస్ (విక్రమాదిత్య), పూజా హెగ్డే (ప్రేరణ) మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే..మంచి ప్రేమ కావ్యం అయ్యేటట్టు ఉంది. ఈ నేపథ్యంలో డార్లింగ్.. గతంలో లవర్‌బాయ్‌గా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం..
డార్లింగ్
తన కెరీర్లో అప్పటి వరకు మాస్ కథా చిత్రాల్లో అలరించిన ప్రభాస్ 'డార్లింగ్'తో క్లాస్ అండ్ లవర్‌బాయ్ హీరోగా మారిపోయారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్ క్లాసీలుక్, నటన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేసింది. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ప్రభాస్ సూపర్‌గా నచ్చేశారు. ఈ మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో ప్రభాస్ చేసిన కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. మొత్తానికి ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
మిస్టర్ పెర్ఫెక్ట్
మళ్లీ కాజల్ అగర్వాల్‌తో కలిసి దశరథ్ దర్శకత్వంలో 'మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమాలో నటించారు ప్రభాస్. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో తాప్సీ మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కన్నా పెద్ద హిట్‌ను అందుకుంది. "కెరీర్లో గెలవాలంటే రాజీపడకుండా కష్టపడాలి. అప్పుడే గెలుస్తాం. కానీ బంధాల్లో కొన్నిసార్లు రాజీపడితేనే గెలుస్తాం" అని ప్రభాస్ చెప్పిన డైలాగ్‌లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో క్లీన్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ప్రభాస్. 2011లో విడుదలైన ఈ చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.