తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాతకాలు నమ్మని ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ ఎలా చేశారు?: రాజమౌళి - ప్రభాస్

Prabhas Radheshyam: డార్లింగ్​ ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ శుక్రవారమే (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు ప్రభాస్. స్వతహాగా జాతకాలు నమ్మని ప్రభాస్​.. 'రాధేశ్యామ్'​ ఎలా చేశారని ప్రశ్నించారు దర్శకధీరుడు రాజమౌళి. దీనికి ప్రభాస్​ ఏం చెప్పారంటే..

prabhas radheshyam
rajamouli

By

Published : Mar 10, 2022, 6:41 PM IST

'రాధేశ్యామ్​'పై ప్రభాస్​-రాజమౌళి ఇంటర్వ్యూ

Prabhas Radheshyam: పాన్​ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్​' శుక్రవారం (మార్చి 11) నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు ప్రభాస్‌. విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరు అనేది ఈ సినిమాలో ముఖ్య అంశం. అయితే నిజ జీవితంలో జాతకాలను నమ్మని ప్రభాస్ ఈ సినిమాలో అలాంటి పాత్ర ఎందుకు చేశారని ప్రశ్నించారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. వీరిద్దరూ కలిసి సినిమా ప్రచారంలో భాగంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. జక్కన్న ప్రశ్నకు డార్లింగ్​ ఏం చెప్పారంటే..

"మా గురువుగారు (రాజమౌళి).. జాతకాలను నమ్మరు. నేనూ నమ్మను. ఆయన నమ్మి ఉంటే నమ్మేవాడినేమో (నవ్వుతూ). అయితే నేను నమ్మినా నమ్మకపోయినా.. 'విక్రమాదిత్య' అనే పాత్ర కోసమే అలా చేశా. 'బాహుబలి'లో చాలామందిని చంపేశాను. అలా బయట కూడా చేయలేనుగా! నిజజీవితంలో నేను కష్టాన్నే ఎక్కువగా నమ్ముతాను. అయితే 'బాహుబలి' చేసిన తర్వాత.. కష్టానికి మించి ఏదో ఉంటుందని అనిపించింది."

-ప్రభాస్, నటుడు

దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్. రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇదీ చూడండి:అందుకే ప్రభాస్​ పెళ్లి ఆలస్యం: కృష్ణంరాజు సతీమణి

ABOUT THE AUTHOR

...view details