ప్రేమికుల దినోత్సవం కానుకగా ప్రభాస్ 'రాధేశ్యామ్' గ్లింప్స్ విడుదలైంది. స్టైలిష్గా కనిపిస్తున్న డార్లింగ్.. రొమాంటిక్ లుక్లో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. 'నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?' అని పూజ ప్రశ్నించగా.. 'ఛ.. వాళ్లు ప్రేమ కోసం చచ్చారు. నేను ఆ టైప్ కాదు' అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.
'రాధేశ్యామ్' గ్లింప్స్.. సినిమా విడుదల తేదీ ఖరారు - ప్రభాస్ రాధేశ్యామ్
ప్రభాస్-పూజా హెగ్డేల 'రాధేశ్యామ్' గ్లింప్స్, వాలంటైన్స్ డే కానుకగా అభిమానులతో పంచుకున్నారు. ఆద్యంతం అలరిస్తూ సినిమాపై ఇది అంచనాల్ని పెంచుతోంది. జులై 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.
ఈ వింటేజ్ ప్రేమకథకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీతమందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియర్ నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నాురు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి ప్రేమ కథలో ప్రభాస్ నటిస్తుండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.