డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్(radhe shyam release date) వచ్చేసింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల దాహం తీర్చింది. శనివారం, ప్రభాస్ పుట్టినరోజు(prabhas birthday special) కానుకగా దానిని రిలీజ్ చేశారు. రిచ్ విజువల్స్‌తో ఉన్న టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.
'నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో తెలుసు.. కానీ చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు.. కానీ నీకు చెప్పను. చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. కానీ నేను దేవుడిని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు' అని టీజర్లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.