తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Radhe shyam song: 'రాధేశ్యామ్' రెండో పాట అప్డేట్ - రాధేశ్యామ్ సెకండ్ సాంగ్

'రాధేశ్యామ్' కొత్త అప్డేట్ రిలీజైంది. రెండో గీతానికి సంబంధించిన టీజర్​ను సోమవారం(నవంబరు 29) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

prabhas radhe shyam movie
రాధేశ్యామ్ మూవీ

By

Published : Nov 28, 2021, 11:08 AM IST

Updated : Nov 28, 2021, 11:40 AM IST

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే తొలి గీతం అలరిస్తుండగా, రెండో సాంగ్​ టీజర్​ను సోమవారం(నవంబరు 29), ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. హిందీ వెర్షన్​ మధ్యాహ్నం ఒంటి గంటకు, తెలుగు-తమిళ-కన్నడ-మలయాళ వెర్షన్​ పాట టీజర్లను సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేసింది. ఇందులో డార్లింగ్ హీరో పాలమిస్ట్​గా(హస్తరేఖలు చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తి) నటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్​ అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ఈ చిత్రంలో సీనియర్ నటి భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా 'రాధేశ్యామ్' విడుదల కానుంది.

ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2021, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details