Radhe shyam Sanchari song: 'రాధేశ్యామ్' నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. 'సంచారి' అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ఇందులో విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రభాస్.. లవర్‌బాయ్‌గా, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు. పాటలో లొకేషన్స్ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సన్నివేశాల్లో డార్లింగ్ స్టంట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా అభిమానులను విపరీతంగా ఉర్రూతలూగించాయి.
రాధేశ్యామ్ 'సంచారి' సాంగ్ రిలీజ్ - రాధేశ్యామ్ సంచారీ సాంగ్
Radhe shyam Sanchari song: ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా నుంచి 'సంచారి' సాంగ్ రిలీజై అలరిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.

రాధేశ్యామ్ సంచారి సాంగ్ రిలీజ్
కాగా, 1970ల నాటి యూరప్ నేపథ్య కథతో 'రాధేశ్యామ్'ను తెరకెక్కించారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 23న విడుదల చేస్తారని సమాచారం.
ఇదీ చూడండి: ప్రభాస్‌తో తొలిరోజు షూటింగ్ అలా గడిచింది: దీపిక