అభిమానులు గత కొన్నిరోజులుగా అనుకుంటున్నదే జరిగింది! డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' వాయిదా పడింది. ఒమిక్రాన్ వల్ల ఏర్పడిన ఆంక్షలు, పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ త్వరలో చెబుతామని చిత్రబృందం ప్రకటించింది.
'రాధేశ్యామ్' వాయిదా.. త్వరలో కొత్త రిలీజ్ డేట్ - RRR postponed
11:31 January 05
ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా రాధేశ్యామ్ వాయిదా
1970ల నాటి ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్, పాలమిస్ట్(హస్తరేఖా సాముద్రిక నిపుణుడు)గా నటించారు. పూజాహెగ్డే హీరోయిన్. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు.
ఈ సినిమాకు దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించగా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
ప్రభాస్ ప్రస్తుతం 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో 'స్పిరిట్' చేస్తారు.