తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Prabhas: ప్రభాస్ 'రాధేశ్యామ్' ఓటీటీలోనా? - prabhas news

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లవ్​స్టోరీ 'రాధేశ్యామ్'. లాక్​డౌన్​ ప్రభావంతో థియేటర్లు మూసి ఉండటం వల్ల, ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం.

Prabhas 'Radhe Shyam' movie OTT release?
ప్రభాస్

By

Published : Jun 3, 2021, 10:54 PM IST

Updated : Jun 3, 2021, 10:59 PM IST

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' నేరుగా ఓటీటీలో రానుందా?.. గతకొన్నిరోజుల నుంచి దీని గురించి పలు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్​లో ఇప్పటికే వచ్చిన పలు సినిమాల తరహా 'పే పర్ వ్యూ' పద్ధతితో పాటు విదేశాల్లో థియేటర్లలో ఒకేసారి విడుదల చేయనున్నారంటూ న్యూస్ వచ్చింది. ఇప్పుడీ విషయమై చిత్రబృందం కూడా స్పందించినట్లు తెలుస్తోంది.

మరో వారం మాత్రమే షూటింగ్ మిగిలి ఉందని, తమకు ఎలాంటి తొందరపాటు లేదని 'రాధేశ్యామ్' యూనిట్ తెలిపింది. థియేటర్లలోనే సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేసి, ఓటీటీ వార్తలకు చెక్ పెట్టింది.

రాధేశ్యామ్​లో ప్రభాస్-పూజాహెగ్డే

వింటేజ్ లవ్​స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇది చదవండి:Prabhas-Nag ashwin: కేవలం రెమ్యునరేషన్ రూ.200 కోట్లు!

Last Updated : Jun 3, 2021, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details