Prabhas project K movie: ప్రభాస్ కొత్త సినిమా 'ప్రాజెక్టు K'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభాస్, దీపిక చిత్రీకరణలో పాల్గొన్నట్లు వెల్లడించారు. వారిద్దరూ చేతులు పట్టుకున్న వీడియోను శనివారం పోస్ట్ చేశారు.
సైన్స్ ఫిక్షన్ కథతో తీస్తున్న ఈ సినిమాకు 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్.. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
దీనితో పాటు 'రాధేశ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. వీటి తర్వాత 'స్పిరిట్' చిత్రం చేస్తారు.
Vijay beast movie: విజయ్ 'బీస్ట్' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని వెల్లడించిన చిత్రబృందం.. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్-విజయ్ హగ్ చేసుకున్న ఫొటోను పోస్ట్ చేసింది.
బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో విజయ్
ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. అనిరుధ్ సంగీతమందించారు. సన్‌పిక్చర్ నిర్మించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
Allu arjun pushpa: అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే దీనికి వచ్చే గెస్ట్‌లు ఎవరనేది ఇంతవరకు వెల్లడించలేదు.
శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. 'పుష్ప' తొలి భాగం డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది.
*ఇటీవల థియేటర్లలో సందడి చేసిన హాలీవుడ్ భారీ సినిమా 'ఎటర్నల్స్'. ఇప్పుడు ఓటీటీలోనూ అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. జనవరి 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ చిత్రం స్ట్రీమింగ్ చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ క్రమంలోనే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఎటర్నల్స్ ఓటీటీ రిలీజ్ డేట్
ఇవీ చదవండి: